సైబర్‌ ‌టీమ్‌ను అభినందించిన ఎస్పీ సునీల్‌ ‌దత్‌

3
60

‌చింతిర్యాల క్రాస్‌ ‌రోడ్‌,అశ్వాపురం నకు చెందిన సత్తు సందీప్‌ అనే యువకుడు ఓఎల్‌ఎక్స్ ‌యాప్‌ ‌లో రెడ్‌మీ నోట్‌ ‌మొబైల్‌ ‌ను రూ7,000/-లకు ఆఫర్లో వస్తుందని ఆశపడి పెటియం ద్వా రా మోసగాడు మొబైల్‌ ‌నంబరుకు ఆన్లైన్లో పంపించాడు. రెండు రోజు ల్లో మొబైల్‌ ‌వస్తుందని ఆశగా ఎదురు చూసిన సందీప్‌ ‌తిరిగి నగదు పంపిన ఫోన్‌ ‌నెంబరుకు ప్రయత్నిస్తే స్విచ్‌ ఆఫ్‌ ‌చేసి ఉంది. తను మోస పోయానని గమనించిన సందీప్‌ ‌వెంటనే పోలీసులను ఆశ్రయిం చాడు. స్థానిక పోలీసులు ఇట్టి విషయాన్ని సైబర్‌ ‌టీమ్‌ ‌నకు తెలియజేయగా, స్పందించిన సైబర్‌ ‌టీం సభ్యులు వెంటనే విచారణ చేపట్టారు. ఓఎల్‌ఎక్స్ ‌యాప్‌ ‌ద్వారా మోసం చేసిన వ్యక్తి యొక్క బ్యాంక్‌ అకౌంట్‌ ‌నెంబరును ట్రాక్‌ ‌చేసి, ఆ అకౌంట్లో ఉన్న రూ.2618/-లను బాధితుడు సందీప్‌ అకౌంట్లోకి తిరిగి జమ అయ్యేలా చేశారు.

అంతేకా కుండా ఇట్టి నేరానికి పాల్పడిన వ్యక్తి యొక్క బ్యాంక్‌ అకౌంట్‌ ‌ను సదరు బ్యాంక్‌ ‌వారి ద్వారా సీజ్‌ ‌చేయిం చడం జరిగిందని ఐటి సెల్‌ ‌సిఐ అబ్బయ్య తెలియ జేసారు. బాది •తుడు అకౌంట్లోకి తిరిగి నగదును అందేలా చేసిన సైబర్‌ ‌టీం సభ్యులైన సిఐ అబ్బయ్య మరియు కానిస్టేబుల్‌ ‌గోపి లను జిల్లా ఎస్పీ సునీల్‌ ‌దత్‌ అభినందిం చారు. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ సులభంగా డబ్బును సంపాదించడానికి నేరగాళ్ళు సైబర్‌ ‌నేరాల ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రజలు అందరూ ఎప్పటికప్పుడు అప్రమ త్తంగా ఉండాలని సూచిం చారు.ఓఎల్‌ఎక్స్  ‌లో ఈమధ్య సైబర్‌ ‌నేరగాళ్లు చేరి ఆర్మీ డ్రెస్‌ ‌లో నకిలీ ఫోటో మరియు గుర్తింపు కార్డులు పెట్టి తక్కువ రేటుకి వాహనాలను అమ్ము తామని,తమకి ట్రాన్స్ఫర్‌ అయినం దున ఇలా తక్కువ రేటుకి అమ్ముతు న్నామని నమ్మించి డబ్బులు తమ అకౌంట్లలో వేశాక ఫోన్‌ ఆఫ్‌ ‌చేసి మోసాగిస్తున్నారని అలాంటి గుర్తు తెలియని వ్యక్తులతో ఎలాంటి డబ్బులు లావాదేవీలు జరిపి ప్రజలు మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.బ్యాంకు ఖాతా వివరాలను గాని,ఓటిపి లను గాని గుర్తు తెలియని వ్యక్తుల కు ఇచ్చి మోసపోవద్దని కోరారు.ఈ-కామర్స్ ‌యాప్స్ ‌ద్వారా వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు అప్రమ త్తంగా ఉండాలని సూచించారు.

3 COMMENTS