9674 వలంటీర్ల ఖాళీల భర్తీ

రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న 9674 వలంటీర్ల పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీచేశారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్‌ చొప్పున రాష్ట్రంలో 1,92,964 వలంటీర్ల పోస్టులకుగాను, 1,83,290 వలంటీర్లను భర్తీ చేసినట్లు తెలిపారు. మిగిలిన 9674 పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. నోటిఫికేషన్‌ విడుదల చేసి ఆయా జిల్లాల్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో గుర్తించాలన్నారు. ఆయా గ్రామానికి చెందిన కనీసం పదోతరగతి పాసైన వారిని వలంటీర్లుగా నియమించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఎక్కడైనా ఆయా రిజర్వేషన్లకు సంబంధించిన అభ్యర్థులు లేకపోతే వేరే కేటగిరీకి చెందిన అభ్యర్థులతో భర్తీ చేయాలని, మహిళలకు 50శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని, మొదట మండలం యూనిట్‌గా పరిగణించి ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. మండల స్థాయిలో సంబంధిత కేటగిరీకి సంబంధించిన వారు లేకపోతే జిల్లా యూనిట్‌గా తీసుకోవాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఎస్టీ అభ్యర్థులనే వలంటీర్లుగా నియమించాలని స్పష్టం చేశారు

Share This Post
0 0

Leave a Reply