24 గంటల్లో 175 మరణాలు..భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది.

భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. గత 24 గంటల్లో కరోనాతో 175 మంది చనిపోయారు. కొత్తగా 7,466 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,65,799కు చేరింది. 4,706 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్‌ నుంచి 71,105 కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

మహారాష్ట్రలో అత్యధికంగా 59,546 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 1,982 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో 19,372(మృతులు 148), ఢిల్లీలో 16,281(మృతులు 316), గుజరాత్‌లో 15,572(మృతులు 960), రాజస్థాన్‌లో 8,067(మృతులు 180), మధ్యప్రదేశ్‌లో 7,453(మృతులు 321), యూపీలో 7,170(మృతులు 197), పశ్చిమ బెంగాల్‌లో 4,536(మృతులు 295), ఏపీలో 3,245, బీహార్‌లో 3,185, కర్ణాటకలో 2,533, తెలంగాణలో 2,256 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

Share This Post
0 0

Leave a Reply