19న పల్స్‌ పోలియో

రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 19న పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ సారి ఒకే రౌండ్‌లో ఈ కార్యక్రమాన్ని పూర్తిచేస్తామని, మొత్తం 38 లక్షల మంది చిన్నారులకు చుక్కల మందు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించింది. నవజాత శిశువు మొదలు ఐదేళ్లలోపు చిన్నారులందరికీ ఈ మందు వేయనున్నట్లు తెలిపింది. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా 23,231 బూత్‌లు, 830 సంచార వాహనాలను సిద్ధం చేస్తామని పేర్కొంది. సంచార వాహనాల ద్వారా.. ఇటుకబట్టీలు, వ్యవసాయ కూలీలు అధికంగా ఉండే ప్రాంతాలు, హైరిస్క్‌ బస్తీల్లో ఈ కార్యక్రమాన్ని చేపడతామని వివరించింది. దీంతోపాటు.. రైల్వే, బస్‌, మెట్రోస్టేషన్లలో 750 చోట్ల పల్స్‌పోలియో కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపింది. మెట్రోస్టేషన్లలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి అని వెల్లడించింది. ఈ నెల 19న చుక్కల మందు వేయించుకోని పిల్లలను గుర్తించేందుకు 20, 21 తేదీల్లో ఇంటింటికీ పల్స్‌పోలియో కార్యక్రమాన్ని చేపడతామని పేర్కొంది.

Share This Post
0 0

Leave a Reply