సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నాగార్జున హీరోగా తెరకెక్కిన గోవింద గోవింద సినిమా విషయంలో తలెత్తిన వివాదం వలన తన మకాంను ముంబైకి మార్చేసిన సంగతి తెలిసిందే. అక్కడ నుండే అటు హిందీ, ఇటు తెలుగు సినిమా కార్యకలపాలని కొనసాగిస్తూ వస్తున్నాడు. అయితే ఇటీవల తెలుగులో ఎక్కువగా కాంట్రవర్సీస్ సినిమా చేస్తున్న వర్మ తాజాగా హైదరాబాద్‌లోను ఓ ఆఫీస్ ఓపెన్ చేశాడు . ఆఫీస్ బయటి లుక్‌ని తన ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. ఇదే నా హైదరాబాద్ ఆఫీస్ బయటి లుక్.. సైకిల్ చైన్, గన్‌కి మధ్యలో కనిపిస్తున్న కిటికీలోనే నా డెన్ ఉంది అంటూ పోస్ట్ పెట్టారు. వర్మ ప్రస్తుతం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు పేరుతో వివాదాస్పద చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం మరి కొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
