హైదరాబాదీలకు మెట్రో కానుక… ఇక రూ. 75కే స్మార్ట్ కార్డ్

హైదరాబాద్ వాసుల ప్రయాణ అవసరాలను తీరుస్తూ, రోజుకు 2.20 లక్షల మందికి సేవలందిస్తున్న ఎల్అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, ప్రజలకు ఉగాది కానుకను ప్రకటించింది. ఇప్పటివరకూ రూ. 150గా ఉన్న స్మార్ట్ కార్డ్ ధరను రూ. 75కు తగ్గించింది. మరో మూడు నెలల వరకూ రూ. 75తోనే మెట్రో కార్డులను కొనుగోలు చేయవచ్చని తెలిపింది. ఇందులో రూ. 25 కార్డు ఖర్చని, మిగతా రూ. 50ని ప్రయాణానికి వినియోగించుకోవచ్చని పేర్కొంది. ఆపై రూ. 50 నుంచి రూ. 3 వేల వరకూ రీచార్జ్ చేసుకోవడం ద్వారా ప్రయాణ అవసరాలను తీర్చుకోవచ్చని వెల్లడించింది. కాగా, ఇప్పటివరకూ సుమారు 6 లక్షల మంది మెట్రో కార్డులను వినియోగిస్తున్నారు. నిత్యమూ మెట్రోలో ప్రయాణించే వారిలో 1.50 లక్షల మంది స్మార్ట్ కార్డులను వాడుకుంటున్నారు.

Share This Post
0 0

Leave a Reply