హెల్పింగ్ హ్యాండ్స్ హ్యుమానిటీ సంస్థలో కేటీఆర్ దీపావళి సంబరాలు

 

 

దీపావళి పండుగ సందర్భంగా మంత్రి కేటీఆర్ పెద్ద మనసును చాటుకున్నారు. హెల్పింగ్ హ్యాండ్స్ హ్యుమానిటీ సంస్థకు చెందిన చిన్నారులకు 12 లక్షల రూపాయల చెక్కును విరాళంగా అందజేశారు. పండగ పూట చిన్నారులతో కేటీఆర్ సరదాగా
గడిపారు. పిల్లలకు స్వీట్లు, పటాకులు పంచి.. వాళ్లలో ఉత్సాహాన్ని నింపారు. పండగ వేళ చిన్నారులతో ఇలా గడపడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. చాలాకాలం తర్వాత ఇదే తన అత్యుత్తమ దీపావళి అని సంతోషం వ్యక్తం
చేశారు. హెల్పింగ్ హ్యాండ్స్ హ్యుమానిటీ సంస్థకు చెందిన చిన్నారులకు అందరూ అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఎలాంటి అవసరమున్నా తనను సంప్రదించవచ్చని కేటీఆర్ భరోసా ఇచ్చారు.

TAGS:Minister KTR , Deewali , Telangana , Helping Hands Humanity , Hyderabad ,

Share This Post
0 0

Leave a Reply