హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో జనసేన వ్యూహం ఏంటి?

Pawan-Kalyan

ఈనెల 21వ తేదీన హుజూర్ నగర్ కు ఉపఎన్నిక జరగబోతున్నది. తెరాస, కాంగ్రెస్, బీజేపీ, టిడిపిలు ప్రధానంగా పోటీలో ఉన్నాయి. తెరాస పార్టీకి లెఫ్ట్ పార్టీ మద్దతు ఇస్తోంది. టీడీపీకి మరో లెఫ్ట్ పార్టీ అండగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, తెరాస పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైకాపా మద్దతు కోరింది. దానికి సానుకూలంగా స్పందించిన వైకాపా మద్దతు ఇచ్చేందుకు ఒకే చెప్పింది.

సేవ్ నల్లమల కార్యక్రమంతో కాంగ్రెస్ పార్టీకి జనసేన దగ్గరైంది. ఈ చనువుతోనే కాంగ్రెస్ పార్టీ జనసేన మద్దతు కోరింది. అయితే, జనసేన అధ్యక్షుడు పవన్ కేరళలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కాబట్టి వచ్చిన తరువాత జనసేన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తే .. తెరాస పార్టీకి వ్యతిరేకం అవుతుంది. ఎలాగో ఆంధ్రాలో జనసేన వైకాపాకు వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు వైకాపా తెరాస కు మద్దతు ఇవ్వడంతో.. జనసేన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం లేకపోలేదు. కాంగ్రెస్ ను వ్యతిరేకించిన జనసేన ఇప్పుడు ఎలా కలిసి పనిచేస్తుందని కొందరు విమర్శించే అవకాశాలు ఉన్నాయి. హుజూర్ నగర్ విషయంలో జనసేన వ్యూహం ఏంటి అన్నది త్వరలోనే తెలుస్తుంది.

Share This Post
0 0

Leave a Reply