హుజూర్‌నగర్‌లో మళ్లీ భారీ వర్షం… సీఎం సభ జరిగేనా?

సీఎం కేసీఆర్ సభకు వరుణుడు మళ్లీ అడ్డంకిగా మారతాడా? ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా కేసీఆర్ నిర్వహించ తలపెట్టిన సభ వర్షం కారణంగానే రద్దైంది. ఈరోజు కూడా ఆ వరుణుడే అడ్డంకిగా మారతాడా అన్న సందేహం వ్యక్తమౌతోంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించడంతో శనివారం కృతజ్ఞత సభను నిర్వహించాలని టీఆర్‌ఎస్ తలపెట్టింది.

ఈ సభ సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభం కావాల్సింది ఉంది. ఇప్పటికే అక్కడ భారీ వర్షం కురుస్తుండటంతో పార్టీ శ్రేణులు ఆందోళనలో మునిగిపోయారు. అసలు సభ జరుగుతుందా? లేదా? అన్న అనుమానాలు నాయకుల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు సీఎం కేసీఆర్ ఇప్పటికే హైదరాబాద్ నుంచి హుజూర్‌నగర్ బయల్దేరారు.

Share This Post
0 0

Leave a Reply