హీరో రాజశేఖర్ కారు బోల్తా…గాయాలు

టాలీవుడ్ సీనియర్ హీరో రాజ‌శేఖ‌ర్ కారు ప్రమాదానికి గురయ్యింది. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఆయన కారు అదుపు తప్పి బోల్తా పడింది. అయితే వెంటనే కారులో ఉన్న ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో రాజశేఖర్ ఆయనతో పాటు ప్రయాణిస్తున్న మరో వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడిటన్లు సమాచారం. వేగంగా వెళుతున్న నేప‌థ్యంలోనే కారు అదుపు తప్పి పల్టీలు కొట్టినట్టు సమాచారం. కారు ఏకంగా మూడు ప‌ల్టీలు కొట్టిన‌ట్టు చెబుతున్నారు. స‌మ‌యానికి బెలూన్స్ తెరుచుకోవ‌డంతో పెద్ద ప్రమాదం త‌ప్పింద‌ని లేదంటే తీవ్ర్ గాయాలు అయ్యేవని అంటున్నారు. హైద‌రాబాద్ నుండి విజ‌య‌వాడ‌కి వెళుతున్న నేప‌థ్యంలో ఈ ప్రమాదం జ‌రిగింద‌ని అంటున్నారు. ఘటనకు సంబందించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో కూడా అదే ఓఆర్ఆర్ మీద రాజశేఖర్ ప్రమాదానికి గురయ్యారు. అప్పుడు చిన్నపాటి గాయాలతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

Share This Post
0 0

Leave a Reply