హాజీపూర్ వరుస హత్యాచారాల కేసుల్లో.. దోషి శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష!

తెలంగాణలో సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యాచారాల కేసుల్లో దోషిగా తేలిన శ్రీనివాస్ రెడ్డికి నల్గొండలోని ఫోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉరిశిక్ష విధించింది. ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు నిర్ధారణ జరిగింది. మూడు కేసుల్లో శ్రీనివాస్ రెడ్డి దోషిగా తేలాడని కోర్టు పేర్కొంది. దోషిని చనిపోయే వరకు ఉరితీయాలని వాదించిన ప్రాసిక్యూషన్ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. మూడు నెలలపాటు కోర్టు ఈ కేసులపై విచారణ జరిపింది. కేసులో ఫోరెన్సిక్ నివేదిక కీలకంగా మారింది. విచారణలో భాగంగా కోర్టు 101 మంది సాక్షులను విచారించింది.

Share This Post
0 0

Leave a Reply