హరీష్ రావు బీజేపీవైపు చూస్తున్నారా.!?

తెలంగాణ రాష్ట్ర సమితిలో కేసీఆర్ తర్వాత అంతటి సీనియర్ నాయకుడు – ఆయన మేనల్లుడు అయిన సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తాజాగా భారతీయ జనతా పార్టీలో చేరడానికి చూస్తున్నారని సోమవారం  ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో కథనం రావడం చర్చనీయాంశంగా మారింది. అందులో సంచలన విషయాలను రాసుకొచ్చారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. బీజేపీ నాయకత్వం హరీష్ రావును సంప్రదించిందని.. తర్వాతి ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తామని.. బీజేపీలో చేరాలని ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం.

తెలంగాణలో బీజేపీకి సరైన నాయకుడు లేకుండా పోయారు. మొన్నటి ఎన్నికల్లో ఉద్దండులైన బీజేపీ నేతలు లక్ష్మన్ కిషన్ రెడ్డిలు సైతం ఓడిపోయారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు కంటే మెరుగైన నాయకుడు లేడని భావించిన బీజేపీ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు సదురు ఆంగ్ల జాతీయ పత్రిక రాసుకొచ్చింది.

ఇక హరీష్ రావు సైతం టీఆర్ఎస్ లో తన ప్రాధాన్యతను తగ్గిస్తున్న దృష్ట్యానే తన బలాన్ని ప్రదర్శించడానికి ఒకవేదికను కోరుకుంటున్నట్టు పత్రిక అభిప్రాయపడింది.

Share This Post
0 0

Leave a Reply