సెంచ‌రీ కొట్టిన బిగ్ బాస్.. హౌజ్‌లో సంద‌డి చేసిన సుమ‌

బిగ్ బాస్ సీజ‌న్ 3 స‌క్సెస్‌ఫుల్‌గా వంద ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. మ‌రో ఐదు రోజుల‌లో ఈ కార్య‌క్ర‌మానికి ఎండ్ కార్డ్ ప‌డ‌నుంది. 17 మంది స‌భ్యుల‌తో మొద‌లైన బిగ్ బాస్ జ‌ర్నీలో ప్ర‌స్తుతం ఐదుగురు స‌భ్యులు మాత్ర‌మే మిగిలారు. వీరిలో ఒక‌రు విజేత‌గా నిల‌వ‌నున్నారు. ఆ విజేత ఎవ‌ర‌నే దానిపై ప్ర‌స్తుతం హాట్ హాట్ డిస్క‌ష‌న్స్ న‌డుస్తున్నాయి. అయితే గ‌త‌వారం శివ‌జ్యోతి ఎలిమినేట్ కాగా, ఈ వారం ఎలాంటి నామినేష‌న్ ప్ర‌క్రియ‌లు ఉండ‌వు.

నామినేష‌న్ ప్ర‌క్రియ లేని క్ర‌మంలో ఇంటి స‌భ్యుల‌లో జోష్ నింపేందుకు ప్ర‌ముఖ యాంక‌ర్ సుమ‌ ఇంట్లోకి అడుగుపెట్టారు. ప్రేక్ష‌కుల త‌ర‌పున నేను ఈ ఇంటికి వ‌చ్చానే త‌ప్ప‌, యాంక‌ర్‌గా రాలేద‌ని చెప్పింది సుమ‌. బెడ్ రూం, బాత్ రూం, లివింగ్ ఏరియా అన్నింటిపై ఓ లుక్కేసింది. దీపావ‌ళి విశేషాల‌ గురించి అడిగింది. సుమ బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టిన సంద‌ర్భంగా మ‌ట‌న్ బిర్యానీకి సంబంధించిన ఐటెమ్స్ పంపారు. వాటిని వండి అంద‌రు ఆర‌గించారు.ఆ త‌ర్వాత ఇంటి స‌భ్యుల‌తో కలిసి ఫ‌న్నీ టాస్క్ ఆడింది సుమ‌.

Share This Post
0 0

Leave a Reply