సూర్యతో ఓకేనా స్వీటీ?

సూర్యతో మరోసారి రొమాన్స్‌ చేయడానికి స్వీటీ రెడీ అవుతున్నట్లు తాజా సమాచారం. సూర్య కథానాయకుడిగా నటిస్తూ, తన 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్న సేరరై పోట్రు చిత్రం సాధించే విజయం కోసం చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈయన మంచి విజయాన్ని చూసి చాలా కాలమైందని చెప్పవచ్చు. సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో నటించిన పొలిటికల్‌ నేపథ్యంతో కూడిన ఎన్‌జీకే చిత్రంపై చాలా నమ్మకం పెట్టుకున్నారు. అయితే పూర్తిగా నిరాశ పరిచింది. ఇక కేవీ.ఆనంద్‌ దర్శకత్వంలో నటించిన కాప్పాన్‌ మిశ్రమ స్పందనతోనే సరిపెట్టుకుంది. దీంతో తనే స్వయంగా నిర్మిస్తూ, నటిస్తున్న సూరరై పోట్రు చిత్ర విజయం సూర్యకు చాలా అవసరం. ఇరుదుచుట్రు చిత్రం ఫేమ్‌ సుధ కొంగర ఈ చిత్రానికి దర్శకురాలు. చిత్రం ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకుంది. వచ్చే నెలలో తెరపైకి వచ్చే అవకాశం ఉంది.

Share This Post
0 0

Leave a Reply