సీనియర్‌ ఫొటో జర్నలిస్టు రాజమౌళి కన్నుమూత

ఈనా డు దినపత్రిక సీనియర్‌ ఫొటో జర్నలిస్టు రాజమౌళి (55) హఠాన్మరణం చెందారు. మెదడులో రక్తం గడ్డకట్టిన కారణంగా మూడ్రోజుల కిందట దవాఖానలో చేరిన ఆయన చికిత్సపొందుతూ మంగళవారం ప్రాణాలు వదిలారు. రాజమౌళి మృతికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మల్కాజిగిరిలోని పటేల్‌నగర్‌ శ్మశానవాటికలో రాజమౌళి అంత్యక్రియలు నిర్వహించారు. 1983లో ఈనాడులో ఫొటో జర్నలిస్టుగా చేరిన రాజమౌళి.. వృత్తి జీవితంలో రాణించారు. తన ఫొటోల ద్వారా సమాజ చైతన్యానికి కృషిచేశారు. ఆకట్టుకొనే ఫొటోలు తీసి జాతీయ, రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో ఎన్నో అవార్డులు, బహుమతులు అందుకున్నారు.

Share This Post
0 0

Leave a Reply