సర్కారు ఆధ్వర్యంలోనే మద్యం షాపులు…

ఏపీలో కీలక పాలనా సంస్కరణలకు ఉద్దేశించిన ఐదు కీలక బిల్లులను రాష్ట్ర శాసనసభ ఇవాళ ఆమోదించింది. వీటిలో ఆంధ్రప్రదేశ్ పంట హక్కు దారుల బిల్లు, ఆంధ్రప్రదేశ్ హిందూ ధార్మిక సంస్థలు , దేవాలయాల సవరణ బిల్లు, విద్యుత్ శాసననాల సవరణ బిల్లు, పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం రిజర్వేషన్ల కల్పన, ఆంధ్రప్రదేశ్ మద్యం వ్యాపార క్రమబద్దీకరణ సవరణ బిల్లులు ఉన్నాయి. ప్రతిపక్ష టీడీపీ సభ్యుల గైర్హాజరీలో ఈ బిల్లులు శాసనసభ ఆమోదాన్ని పొందాయి. శాసనసభలో మాట్లాడేందుకు అవకాశం కల్పించటం లేదని ఆరోపిస్తూ టీడీపీ సభ్యులు ఇవాళ్టి సమావేశాన్ని బహిష్కరించారు. దీంతో అధికార పార్టీ సభ్యుల హాజరీ మధ్య ఈ బిల్లులు ఆమోదం పొందాయి.

ఆంధ్రప్రదేశ్ పంటల సాగుదారుల హక్కుల బిల్లును ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ సభలో ప్రవేశ పెట్టగా… సభ ఏకగ్రీవంగా ఆమోదాన్ని తెలియచేసింది. కౌలు రైతులకు రైతు భరోసా పథకం కింద అందించే పెట్టుబడి సాయాన్ని ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అందించేందుకు వీలు కల్పించేందుకు ఈ బిల్లు తీసుకొచ్చారు. భూ యజమానుల హక్కులకు భంగం కలుగకుండా కౌలు రైతులకు ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా ఆంధ్రప్రదేశ్ పంటల సాగుదారుల హక్కుల బిల్లుకు శాసనసభ ఆమోదాన్ని తెలిపింది. రాష్ట్రంలోని దేవాలయాల్లో పాలక మండళ్ల రద్దు, నియామకాలు, తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలిలో తుడా ఛైర్మన్ ను సభ్యునిగా చేర్చేందుకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ, హిందూ ధార్మిక సంస్థలు, దేవాలయాల సవరణ బిల్లుకు ఆమోదాన్ని శాసనసభ ఆమోదాన్ని తెలిపింది.

అటు విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ వయస్సును 65 ఏళ్లకు తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాసనాలు, ఆంధ్రప్రదేశ్ సవరణ బిల్లుకూ శాసనభ ఆమోదించింది. ఇక పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, కర్మాగారాల స్థానిక అభ్యర్ధుల ఉపాధి బిల్లుకు ఏపీ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదాన్ని తెలిపింది.

Share This Post
0 0

Leave a Reply