సమీక్ష ముందే చేసుంటే..

ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలపై నాలుగు రోజుల ముందే సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించి ఉంటే 15 మంది విద్యార్థులు బతికేవారని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ విజయశాంతి అన్నారు. ఇంటర్‌ ఫలితాల తప్పిదాల నుంచి ప్రభుత్వం ఇప్పటికీ తప్పించుకోవాలని చూడటం సిగ్గుచేటని బుధవారం ఒక ప్రకటనలో ఆమె విమర్శించారు. విద్యార్థుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్‌ నేత రాములు నాయక్‌ ఆరోపించారు. ఆత్మహత్యలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని కాంగ్రెస్‌ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నేరేళ్ల శారద అన్నారు. 18 మంది విద్యార్థుల ప్రాణాలు పోవడానికి కారణమైన విద్యాశాఖ అఽధికారులను, గ్లోబరీనా సంస్థను కాపాడేలా సీఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మానవతారాయ్‌ ఆరోపించారు. కాగా గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు కాంగ్రెస్‌ పార్టీ ధర్నాలు చేయనుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు

Share This Post
0 0

Leave a Reply