సమగ్ర శిక్ష అభియాన్‌లో 383 ఉద్యోగాలు

తెలంగాణలో పాఠశాల విద్యకు సంబంధించి ‘సమగ్ర శిక్ష అభియాన్‌’లో తాత్కాలిక, కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా వివిధ విభాగాల్లోని మొత్తం 383 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో మేనేజ్‌మెంట్ ఇన్ఫ్‌ర్మేషన్ సిస్టం (MIS) ఎంఆర్పీ విభాగంలో 144 కోఆర్డినేటర్ పోస్టులు; డీఈవో, డీపీవో కార్యాలయాల్లో 138 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు, 12 సిస్టం అనలిస్ట్ పోస్టులు, 27 అసిస్టెంట్ ప్రోగ్రామర్ పోస్టులు ఉన్నాయి.
పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలను నవంబరు 15న అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. నవంబరు 18న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. నవంబరు 23 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.సరైన అర్హతలున్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

Share This Post
0 0

Leave a Reply