సత్యానగర్‌లో దారుణం..యువతిపై కొబ్బరి బొండాల కత్తితో దాడి

madhulika

కాచిగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని సత్యానగర్‌లో దారుణం జరిగింది. ఇవాళ ఉదయం ఓ యువతిపై ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. తనను ప్రేమించడం లేదనే అక్కసుతో ఆ యువతిపై కొబ్బరి బొండాల
కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను చికిత్స నిమిత్తం మలక్‌పేటలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. యువతిపై దాడికి పాల్పడ్డ యువకుడిని భరత్‌గా గుర్తించారు. బాధితురాలి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

TAGS : KACHIGUDA , MUDER ATTACK , KNIFE , HOSPITAL ,

Share This Post
0 0

Leave a Reply