శ్రీవారి సన్నిధిలో మంత్రి కేటీఆర్‌

వైకుంఠ ఏకాదశి సందర్భంగా సోమవారం తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామివారి ఉత్తరద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు, సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కుమార్తె అలేఖ్యతో కలిసి వేకువజామున శ్రీవారిని దర్శించుకొన్నారు. అనంతరం ఆలయ అధికారులు మంత్రికి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మల్లారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఏ జీవన్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద, దానం నాగేందర్‌, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఏపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులున్నారు.

Share This Post
0 0

Leave a Reply