శబరిమల విధుల్లో 50 ఏళ్లు పైబడిన మహిళా పోలీసులు

 


50 ఏళ్లు పైబడిన మహిళా పోలీసులనే ఆయలం వద్ద భద్రతా విధుల్లో ఉంచారు. సుమారు 15 మంది మహిళా పోలీసులు విధుల్లో ఉన్నారు. ఇవాళ సాయంత్రం
5 గంటలకు ఆలయం తలుపులు తెరుచుకోనున్నాయి. ప్రత్యేక పూజలు ముగిసిన అనంతరం రేపు రాత్రి 10 గంటలకు ఆలయం ద్వారాలు
మూసివేయనున్నారు. అన్ని వయసుల మహిళలకు శబరిమల ఆలయంలోకి ప్రవేశాన్ని కల్పిస్తూ సుప్రీంకోర్టు సెప్టెంబర్‌లో ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. ఈ
ఉత్తర్వుల తర్వాత శబరిమల ఆలయం తెరుచుకోవడం ఇది రెండోసారి. మొదటిసారి పలు మహిళా జర్నలిస్టులు, సామాజిక మహిళా కార్యకర్తలు ఆలయంలోకి
వెళ్లేందుకు ప్రయత్నించిన విషయం విదితమే. శబరిమలలో 144 సెక్షన్ విధించారు పోలీసులు.

 

TAGS:Security Guard , Sabarimala , Temple , Supreme Court , Women Cops ,

Share This Post
0 0

Leave a Reply