శబరిమల.. మహిళల ప్రవేశంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది అత్యున్నత న్యాయస్థానం.. గతేడాది ఇచ్చినదే తుది తీర్పు కాదంటూ వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. శబరిమల బయలుదేరిన బిందు అమ్మిని అనే మహిళను అడ్డుకోవడంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. గతేడాది ఇచ్చిన తీర్పును కాలరాస్తూ ఆమెపై దాడికి పాల్పడ్డారంటూ సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ కోర్టుకు తెలిపారు. అయితే, 2018లో ఇచ్చినదే తుది తీర్పు కాదని, ఈ అంశాన్ని ఏడుగురు సభ్యులతో కూడిన విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశామని తెలిపిన సుప్రీం కోర్టు.. ఆ బెంచే తుది తీర్పు వెలువరిస్తుందని పేర్కొంది. కాగా, గతంలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత శబరిమలకు వచ్చే మహిళా భక్తులకు ప్రత్యేక భద్రత కల్పించిన కేరళ సర్కార్.. ఈ ఏడాది మాత్రం ఎలాంటి భద్రత కల్పించలేమని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Share This Post
0 0

Leave a Reply