వైట్ హౌజ్‌ సమీపంలో కాల్పులు.. ఒకరు మృతి,ఐదుగురికి గాయాలు

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. గురువారం వాషింగ్టన్‌లోని వైట్ హౌజ్‌కు సమీపంలోని వీధుల్లో రాత్రి 10గం. ప్రాంతంలో ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. కాల్పుల్లో ఒక వ్యక్తి మృతి చెందగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. కాల్పుల అనంతరం నిందితుడు పారిపోయాడని.. కాల్పుల వెనుక కారణాలు తెలియరాలేదని చెప్పారు.సీసీటీవి ఫుటేజీని పరిశీలిస్తున్నామని,ప్రత్యక్ష సాక్షుల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు.కాల్పుల్లో గాయపడ్డవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెప్పారు. క్షతగాత్రుల్లో చిన్నారులెవరూ లేరని చెప్పారు. కాల్పుల సమాచారం అందినవెంటనే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Share This Post
0 0

Leave a Reply