‘వినయ విధేయ రామ’.. బ్రేకింగ్ న్యూస్!

upasana-konidela-promotes

టాలీవుడ్‌లో మళ్ళీ మెగా సందడి షురూ అయింది. వరుణ్ తేజ్ చేసిన ‘అంతరిక్షం’ థియేటర్స్‌లోకి వచ్చేసింది. మెగాస్టార్ ‘సైరా’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెట్స్ మీదున్న చెర్రీ 12వ సినిమా కూడా ప్రమోషన్ స్టేజ్‌లో దూసుకుపోతోంది. బోయపాటి శ్రీనివాస్ డైరెక్షన్లో చెర్రీ చేస్తున్న యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ ‘వినయ విధేయ రామ’ ఇప్పటికే టాలీవుడ్‌లో అంచనాల్ని రెట్టింపు చేసింది. మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్న మూవీ ట్రైలర్ డిసెంబర్ 27 గురువారం సాయంత్రం 9 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలకు ముస్తాబవుతున్న ఈ మూవీని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. చెర్రీ సినీ కెరీర్ తో ప్రమేయం లేకుండా తన వ్యాపారమేదో తను చూసుకుంటున్న భార్య ఉపాసన కూడా.. ‘వివిరా’ ప్రమోషన్లో ఒక చెయ్యి వెయ్యడం ఆసక్తికరం

Share This Post
0 0

Leave a Reply