విజయ్ దేవరకొండ జోడీగా ఆలియా భట్?

విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సిద్ధమవుతోంది. ఈ సినిమా తరువాత ఆయన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. పూరి ఈ సినిమాకి పాన్ ఇండియా స్థాయిని తీసుకొచ్చే క్రమంలో కరణ్ జొహార్ ను నిర్మాణ భాగస్వామిగా చేసుకున్నాడు.

విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ హీరోయిన్ అయితే బాగుంటుందని భావించిన పూరి, ఆ విషయాన్ని కరణ్ జొహార్ కి అప్పగించాడట. దాంతో ఎవరి డేట్స్ అందుబాటులో ఉన్నాయా అని కరణ్ జొహర్ చూస్తున్నాడట. జాన్వీ కపూర్ .. సారా అలీఖాన్ .. ఆలియా భట్ డేట్స్ అందుబాటులో వున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆలియా భట్ ఎంపిక కావొచ్చనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది.

Share This Post
0 0

Leave a Reply