వారానికోరోజు మజ్జిగ చాలు

ఇంట్లో పేరుకొనే చెత్తను ఎప్పటికప్పుడు తీసేస్తాం. మరి మన శరీరంలో పేరుకొనే మలినాలు. వాటినీ తొలగించాలి లేదంటే అనారోగ్యాలు దాడిచేస్తాయి. వాటిని ఎప్పటికప్పుడు తొలగించడమే కాదు… అవి పేరుకోకుండా కూడా జాగ్రత్తపడాలి. అందుకు ఆయుర్వేద పరంగా ఏం చేయాలో చూద్దామా…

నిమ్మరసం, మజ్జిగ: వారంలో ఒక రోజు ఆహారంలో భాగంగా ఘనపదార్థాలను మానేసి, కేవలం ద్రవపదార్థాలను మాత్రమే తీసుకోవాలి. ఇలా చేస్తే, శరీరంలోని టాక్సిన్లు బయటకు పోతాయి. ఇందుకు నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, తాజా పండ్ల రసాలు తాగాలి. అలాగే పండ్లు మాత్రమే తినడం వల్ల కూడా శరీరంలో మలినాలు వెలుపలికి పోతాయి.

Share This Post
0 0

Leave a Reply