వడదెబ్బ లక్షణాలు…పాటించాల్సిన జాగ్రత్తలు..ఎలాంటి ఆహారం తీసుకోవాలి

Young man and heat stroke.

సమ్మర్ లో కామన్ సమస్య వడదెబ్బ. శరీర ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటితే సమస్యే. సాధారణంగా ఐదేళ్లలోపు, 60 ఏళ్ల పైబడ్డవారు త్వరగా వడదెబ్బకు గురవుతారు. గర్భిణుల శరీరంలో తేమశాతాన్ని కాపాడుకోకుంటే వడదెబ్బ తగులుతుంది. వడదెబ్బ ప్రభావం ముందుగా కండరాలపై పడుతుంది. రక్తకణాలు కుచించుకుపోతాయి. అనంతరం కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయం ప్రభావం మీద పడుతుంది. సకాలంలో చికిత్స అందించకపోతే ప్రాణాంతకమవుతుంది.

వడదెబ్బ లక్షణాలు :

– వడదెబ్బకు గురైనవారి శరీరంలో నీటిశాతం లోపిస్తుంది.
-శరీర ఉష్ణోగ్రత విపరీతంగా పెరుగుతుంది. దీని వల్ల గుండె, రక్తనాళాలు, కాలేయం, మూత్ర పిండాలు దెబ్బతింటాయి.
-ఒంట్లోని లవణాలు చెమటరూపంలో బయటకు వెళ్లిపోవడంతో మనిషి నీరసించిపోతాడు.
-జ్వరం, వాంతులు, విరేచనాలు, తల తిరుగడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
-అధిక ఉష్ణోగ్రత వల్ల పల్స్ పడిపోతుంది. తలనొప్పి వస్తాయి.

చికిత్స:

-వడదెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే నీడలోకి తీసుకురావాలి.
-బట్టలను వదులు చేసి చల్లని నీటితో శరీరాన్ని తడుపాలి.
-శరీర ఉష్ణోగ్రత తగ్గేలా చూడాలి. ఐస్‌ప్యాక్‌లు పెట్టాలి.
-వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి.. సకాలంలో చికిత్స అందించాలి.

పాటించాల్సిన జాగ్రత్తలు:

-ప్రధానంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఎండలో తిరుగక పోవడం ఉత్తమం.
-ప్రతిరోజూ 5 లీటర్లకు తక్కువ కాకుండా నీరు తాగాలి.
-నీరసంగా అనిపిస్తే ఓఆర్‌ఎస్, గ్లూకోజ్ కలిపిన నీటిని తీసుకోవాలి.
-వేపుడు పదార్థాలు, కాఫీ, ఫాస్ట్‌ఫుడ్, ఆల్కహాల్ తాగడం తగ్గించాలి, మానేయాలి.
వృద్ధులు, మధుమేహంతో బాధపడేవారు ప్రత్యేకించి జాగ్రత్తలు పాటించాలి. సకాలంలో అల్పాహారం, భోజనం తీసుకోవాలి. వీలైనంత వరకు ఎండలో బైటకు వెళ్లకుండా ఉండాలి.
చిన్నారుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకు మెత్తని, పల్చని నూలు దుస్తులనే వేయాలి. నీళ్లు, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకునేలా చూడాలి. పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినిపించాలి. వేసవిలో ఉక్కపోత.. మండే ఎండల నుంచి రక్షణ కోసం పిల్లలు చెరువులు, వాగుల్లో స్నానాలు చేసేందుకు మక్కువ చూపిస్తారు. పిల్లలకు తల్లిదండ్రులు దగ్గరుండి ఈత నేర్పించాలి. ఉదయం, సాయంత్రం వేళల్లోనే ఈతకు వెళ్లాలి.

ఎండాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలకు మజ్జిగే దివ్యౌషధం. చెమట వల్ల శరీరం కోల్పోయిన లవణాలను మజ్జిగ తిరిగి భర్తీ చేస్తుంది. నిస్సత్తువను దూరం చేస్తుంది. వేడి వల్ల కలిగే జలుబుకు కూడా మజ్జిగే దివ్యౌషధం. ఈకాలంలో ఆకలి మందగిస్తుంది. ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి. ఆహారంలో రసం, సాంబార్‌కు ప్రాధాన్యమివ్వాలి. వ్యాయామం చేసేవారు నీళ్లలో కాస్తంత ఉప్పు, నిమ్మరసం కలిపి తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. కొన్నిరకాల పండ్లను తీసుకోవడం ద్వారా శరీరంలో నీటి శాతాన్ని కోల్పోకుండా చూడడంతోపాటు వేసవిలో వచ్చే అనారోగ్యసమస్యలనూ అధిగమించవచ్చు. పుచ్చకాయ, తాటిముంజలు, కొబ్బరి బోండాం, కీరదోస వంటివి శరీరంలో నీటిశాతాన్ని పెంచి అవసరమైన లవణాలను సమకూరుస్తాయి. మంచినీటిని ఎక్కువ గా తాగాలి. వేసవిలో సింథటిక్ ఫ్యాబ్రిక్ దుస్తులను ధరించవద్దు. చెమట వల్ల వీటితో ఎలర్జీలు వస్తాయి. కాటన్, లెనిన్, ఖద్దరుతో ఈ సమస్య ఉండదు. నలుపు, ముదురు రంగు దుస్తులు త్వరగా వేడిని గ్రహిస్తాయి. కాబట్టి సమ్మర్‌లో వాటిని దూరం పెట్టాల్సిందే. తలమీద టోపీ పెట్టుకోవడం, గొడుగును వెంట తీసుకెళ్లడం వల్ల సూర్య కిరణాల నుంచి రక్షణ లభిస్తుంది.

Share This Post
0 0

Leave a Reply