‘లీల’అనే శృంగార పాత్రలో నటిస్తున్న రమ్యకృష్ణ

రమ్యకృష్ణ ఓ ఆసక్తికర పాత్రలో నటించేందుకు సాహసించింది ఓ తమిళ సినిమాలో పోర్న్ స్టార్ పాత్రలో ఆమె కనిపించనున్నారు. ప్రముఖ హీరో విజయ్ సేతుపతి, సమంత జంటగా నటిస్తున్న సినిమా ‘సూపర్ డీలక్స్’.త్యాగరాజన్ కుమారరాజ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ పోర్న్ స్టార్ పాత్రలో కనిపించనుంది. ‘లీల’ అనే శృంగార తార పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నట్టు చిత్ర దర్శకనిర్మాతలు వెల్లడించారు. ఈ పాత్రలో నటించేందుకు తొలుత నటి నదియాను సంప్రదించగా, అందుకు ఆమె తిరస్కరించడంతో రమ్యకృష్ణను తీసుకున్నట్టు చెప్పారు. కాగా, ఈ సినిమాకు పలు ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి లేడీ గెటప్ లో కనిపించనున్నారు. సమంత కూడా రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనుంది.

TAGS: ramya krishna , lalli movie , porn movie ,

Share This Post
0 0

Leave a Reply