‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లోని ‘వెన్నుపోటు’ పాట

ntr

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లోని ‘వెన్నుపోటు’ పాటను ఆ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. ఈ పాటకు సంబంధించిన వీడియోను వర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా రచయిత సిరాశ్రీ, సంగీత దర్శకుడు, గాయకుడు కల్యాణి మాలిక్ లకు తన ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు వర్మ పేర్కొన్నారు. ‘దగా…దగా.. మోసం..నమ్మించి.. వెన్నుపోటు పొడిచారు. వంచించి..వంచించి వెన్నుపోటు పొడిచారు. కుట్ర..కుట్ర..కుట్ర..’ అంటూ ఈ పాట కొనసాగింది. ఈ పాట వినపడుతుండగా నాడు ఎన్టీఆర్, చంద్రబాబు కలిసి ఉన్న పలు దృశ్యాలు కనపడటం గమనార్హం.

 

TAGS :lakshmis ntr , ram gopal varma , movie , dgadga song , ntr ,

 

 

Share This Post
0 0

Leave a Reply