ర‌జ‌నీకాంత్‌కి అరుదైన గౌర‌వం

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌కి అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా 2019 అవార్డ్స్‌లో `ఐకాన్ ఆఫ్ ది గోల్డెన్ జూబ్లీ` అవార్డ్‌తో సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌ను స‌త్క‌రించ‌నున్న‌ట్లు కేంద్ర స‌మాచార ప్ర‌సారశాఖ మంత్రి ప్ర‌కాష్ జ‌వ‌దేవ‌క‌ర్ ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్ర‌క‌టించారు. కొన్ని ద‌శాబ్దాలుగా త‌న న‌ట‌న‌తో ఇండియ‌న్ సినిమాకు ర‌జనీకాంత్ చేసిన సేవ‌ల‌కు ఈ అవార్డును ప్ర‌క‌టించ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్ తెలిపారు. నవంబ‌ర్ 20 నుండి 28 వ‌ర‌కు గోవాలో ఈ గోల్డెన్ జూబ్లీ ఇంటర్నేష‌న్ ఫిలిం ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా అవార్డుల కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. వివిధ దేశాల‌కు చెందిన 250 సినిమాల‌ను ఈ వేడుక‌లో ప్ర‌ద‌ర్శించ‌నున్నారు.

Share This Post
0 0

Leave a Reply