రైతు వేదిక నిర్మాణానికి మంత్రి గంగుల భూమి పూజ

రాష్ట్రంలో రైతు వేదికలు వ్యవసాయ విప్లవానికి నాంది కావాలని ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. రైతు వేదికల నిర్మాణానికి ప్రజాప్రతినిధులు తమవంతు చేయూత అందిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా మంత్రి గంగుల కమలాకర్‌ తన నియోజకవర్గం కరీంనగర్‌లో సొంత ఖర్చులతో రెండు రైతు వేదికలను నిర్మించనున్నట్లు ప్రకటించారు. పేర్కొన్న విధంగానే మంత్రి నేడు జిల్లా కలెక్టర్‌తో కలిసి కొత్తపల్లి మండలం వద్దిపల్లి గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. రైతును రాజును చేయడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని పేర్కొన్నారు.

Share This Post
0 0

Leave a Reply