రైతుబంధు ఇచ్చిన మహాత్ముడు కేసీఆర్‌

ప్రస్తుతం ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం లేకున్నా అప్పులు చేసి రైతులకు రూ. 7 వేల కోట్ల రైతుబంధు, రూ. 12 వేల కోట్ల రుణమాఫీ నిధులు ఇచ్చిన మహాత్ముడు సీఎం కేసీఆర్‌ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కొనియాడారు. జగిత్యాల జిల్లాలోని జగిత్యాల రూరల్‌, కోరుట్ల, ధర్మపురి మండలాల్లో సోమవారం పల్లెప్రగతి ముగింపు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. నియంత్రింత సాగులో భాగంగా పొలంలో మొలకలు చల్లారు. ఉపాధిహామీ పనులను పరిశీలించారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు.
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని పస్రా, చల్వాయి, మచ్చాపూర్‌ గ్రామాల్లో సోమవారం నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. పల్లెప్రగతి నిర్వహణలో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలవడం గర్వకారణమని మంత్రి పువ్వాడ అజయ్‌ అన్నారు. తల్లాడ మండలం అంజనాపురంలో రూ. 1.10 కోట్ల వ్యయంతో నిర్మించే రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.

Share This Post
0 0

Leave a Reply