రేపు అమరావతికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Pawan-Kalyan

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు అమరావతికి రానున్నారు. రేపు ఉదయం 9:30 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు పవన్ చేరుకోనున్నారు. అక్కడ్నుంచి పటమటలంకలోని తన నివాసానికి జనసేనాని వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి మంగళగిరి జనసేన కార్యాలయంలో పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నేతలతో పవన్ సమీక్షా నిర్వహించారు.

ఈ సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని పవన్ పిలుపునిచ్చారు. సమీక్షలో ఎన్నికల ఫలితాలు, త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల గురించి నేతలతో పవన్ చర్చించనున్నారు. ఈ సమావేశం అనంతరం పవన్ ప్రెస్‌మీట్ నిర్వహిస్తారని తెలుస్తోంది

Tags: Janasena, Amaravathi, Pawankalyan

Share This Post
0 0

Leave a Reply