రెండు రోజుల్లో పుల్వామాలాంటి మరిన్ని దాడులు!

jammu kashmir

పుల్వామాలాంటి దాడులు మరిన్ని చేయడానికి జైషే మహ్మద్ ప్లాన్ వేసినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. తాన్‌జీమ్ అనే ఓ చిన్న ఉగ్రవాద గ్రూపు ద్వారా ఈ సమాచారం వెల్లడైంది. జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాల కాన్వాయ్‌లు లక్ష్యంగా ఈ దాడులు జరగనున్నట్లు హెచ్చరించాయి. ఈసారి చౌకీబల్, తాంగ్‌ధర్ రూట్లలో ఈ దాడులు జరగనున్నట్లు ఏజెన్సీలు గుర్తించాయి. ఈ రూట్లలో ఐఈడీ దాడులు జరిగే ప్రమాదం ఉన్నట్లు అంచనా వేస్తున్నాయి. దీనికోసం తాన్‌జీమ్ ఓ ఆకుపచ్చ రంగు స్కార్పియోను సిద్ధం చేసిందని, దాని ద్వారా ఆత్మాహుతి దాడి జరిగే ప్రమాదం ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. జైషే మహ్మద్‌కు చెందిన ఓ సోషల్ మీడియా గ్రూప్‌లోని కోడ్‌ను నిఘా వర్గాలు ఛేదించాయి.

 

TAGS: pulwama attack , pakistan , nia , jammukashmir ,

Share This Post
0 0

Leave a Reply