రూ.8 లక్షలు డిమాండ్ చేసి..

ఏపీలోని కర్నూలు జిల్లా గూడూరు తాసిల్దార్ హసీనాబీ గురువారం రాత్రి ఏసీబీకి చిక్కారు. లంచం డబ్బులు తీసుకురావడానికి వెళ్లిన ఆమె అనుచరుడిని ఏసీబీ అధికారులు అరెస్టు చేయడంతో తాసిల్దార్ ఫోన్ స్విచ్‌ఆఫ్‌చేసి పరారయ్యారు. ఆమె కోసం అధికారులు గాలిస్తున్నారు. భూవివాదం పరిష్కారం కోసం సురేశ్ అనే రైతు నుంచి తాసిల్దార్ రూ.8 లక్షలు డిమాండ్‌చేశారు. రూ.4 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్న బాధిత రైతు ఏసీబీని ఆశ్రయించారు. గురువారం సాయంత్రం 4 గంటలకు తాసిల్ కార్యాలయానికి రైతు వెళ్లగా, తన అనుచరుడు మహబూబ్‌బాషా ఉంటాడని, డబ్బులు అతనికి ఇవ్వాల్సిందిగా తాసిల్దార్ సూచించారు. రాత్రి 7 గంటల సమయంలో పాణ్యం బస్టాండుకు వెళ్లిన రైతు సురే శ్.. తాసిల్దార్ చెప్పిన మధ్యవర్తిని కలిసి డబ్బు లు ఇచ్చారు. అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు మహబూబ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడిని విచారించగా తాసిల్దార్ హసీనాబీ తన ను పంపించినట్టు అధికారులకు చెప్పాడు. రూ.4 లక్షలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బాషాను అరెస్టుచేసిన విషయం తెలుసుకున్న తాసిల్దార్ ఫోన్ స్విచ్‌ఆఫ్‌చేసి పరారయ్యారు. హసీనాబీ కోసం గాలిస్తున్నట్టు ఏసీబీ డీఎస్పీ నాగభూషణం తెలిపారు. హసీనాబీ.. దివ్యాంగురాలు. గ్రూప్స్ పరీక్ష రాసి నేరుగా డిప్యూటీ తాసిల్దార్ ఉద్యోగం సంపాదించారు. ప్రస్తుతం కర్నూలు సీ క్యాంపులో ఉన్న ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటున్నారు. అక్కడి నుంచి గూడూరుకు వచ్చి విధు లు నిర్వహిస్తున్నారు. అధికారులు ఉమెన్స్ హాస్టళ్లన్నీ గాలించినా ఆమె కనిపించలేదు. దీంతో హసీనాబీపై కేసు నమోదుచేసి ఏసీబీ అధికారులు మధ్యవర్తిని కోర్టులో హాజరుపరిచారు.

Share This Post
0 0

Leave a Reply