రూ.600కే జియో బ్రాడ్‌బ్యాండ్‌, ల్యాండ్‌లైన్‌, టీవీ సేవ‌లు..?

టెలికాం సంస్థ రిల‌య‌న్స్ జియోకు చెందిన జియో గిగాఫైబ‌ర్ ఇంకా వాణిజ్య‌ప‌రంగా వినియోగంలోకి రాలేదు. ప్ర‌స్తుతం ఈ సేవ‌ల‌ను ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప‌రీక్షిస్తున్నార‌నే విష‌యం విదిత‌మే. అయితే అతి త్వ‌ర‌లోనే జియో గిగాఫైబ‌ర్ సేవ‌లు పౌరుల‌కు అందుబాటులోకి వ‌స్తాయ‌ని తెలుస్తుండ‌గా.. రూ.600 కే నెల‌వారీ బేసిక్ ప్లాన్ ను జియో గిగాఫైబ‌ర్ లో అందిస్తార‌ని తెలుస్తున్న‌ది.

రూ.600 నెల‌వారీ బేసిక్ ప్లాన్‌లో బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్ లైన్‌, టీవీ సేవ‌లు మూడు ల‌భిస్తాయ‌ని స‌మాచారం. అంటే రూ.600 నెల‌కు క‌నీసం చెల్లిస్తే ఒకేసారి బ్రాడ్‌బ్యాండ్‌, ల్యాండ్ లైన్, టీవీ సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చ‌న్న‌మాట‌. ప్ర‌స్తుతం ఈ సేవ‌ల‌ను విడి విడిగా తీసుకుంటే ఎంత లేద‌న్నా నెల‌కు రూ.1500 నుంచి రూ.2వేల వ‌ర‌కు అవుతుంది. అదే జియోలో అయితే కేవ‌లం రూ.600 బేసిక్ ప్లాన్ తీసుకుంటే చాలు. దీంతో వినియోగ‌దారుల‌కు పెద్ద ఎత్తున డ‌బ్బు ఆదా అవుతుంది. ఇక జియో గిగాఫైబ‌ర్‌లో అందించే బ్రాడ్‌బ్యాండ్‌తో ఏకంగా 40 డివైస్‌ల వ‌ర‌కు ఇంటర్నెట్‌కు క‌నెక్ట్ చేసుకోవ‌చ్చ‌ని తెలిసింది. అయితే ఈ సేవ‌ల‌ను పొందాలంటే ముందుగా రూ.4500 రీఫండ‌బుల్ సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి వ‌స్తుంద‌ని స‌మాచారం. ఇక ఈ సేవ‌ల ద్వారా నెల‌కు 100 జీబీ వ‌ర‌కు ఉచిత డేటా క‌స్ట‌మ‌ర్ల‌కు ల‌భించ‌డంతోపాటు నెట్ స్పీడ్ గ‌రిష్టంగా 100 ఎంబీపీఎస్ వ‌ర‌కు వ‌స్తుంద‌ని తెలిసింది. కాగా జియో గిగాఫైబ‌ర్ సేవ‌లు ఎప్ప‌టి నుంచి ప్రారంభ‌మ‌వుతాయ‌నేది మాత్రం ఇంకా తెలియ‌లేదు. త్వ‌ర‌లో ఆ వివ‌రాలు కూడా తెలుస్తాయి..!

Share This Post
0 0

Leave a Reply