రూ.2 వేల భృతి ఈనెల నుంచే

‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథకం కింద నిరుద్యోగులకు ఇస్తున్న నెలవారీ నిరుద్యోగభృతి రూ.వేయిని రూ.2వేలకు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఈ నెల నుంచే నిరుద్యోగుల్లోని లబ్ధిదారులకు పెంచిన రూ.2వేలను భృతిగా చెల్లించాలని గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కోడ్‌ అమలులో ఉన్న ఏడు జిల్లాలు కాకుండా మిగిలిన ఆరు జిల్లాలయిన ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురంలో వెంటనే వర్తింపజేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇప్పటికే అమలులో ఉన్న పథకమే కాబట్టి ఆ ఏడు జిల్లాల్లోనూ అమలు చేసేందుకు అనుమతించాలని ఎన్నికల కమిషన్‌తో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. మార్చి నెలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 4,46,897 మందికి భృతిని ప్రభుత్వం మంజూరు చేసింది.

Share This Post
0 0

Leave a Reply