రామానాయుడు స్టూడియోపై ఐటీ దాడులు.. ఉదయం నుంచి సోదాలు..

హైదరాబాద్ రామానాయుడు స్టూడియోపై ఐటీ దాడులు జరుగుతున్నాయి.. రామానాయుడు స్టూడియోతో పాటు సురేష్ ప్రొడక్షన్ కార్యాలయంలో ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఏకకాలంలో మొత్తం మూడు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్ లోని సురేష్ బాబు ఇల్లు, రామానాయుడు స్టూడియో, సురేష్ ప్రొడక్షన్ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. రామానాయుడు స్టూడియోతో పాటు టాలీవుడ్‌కు చెందిన కొందరు హీరోలు, దర్శకనిర్మాతల ఇళ్లలో కూడా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది.. రామానాయుడు స్టూడియోతో పాటు మొత్తం పది చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారని సమాచారం.

Share This Post
0 0

Leave a Reply