రాజ్యసభకు కవిత!

అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజ్యసభకు వెళ్లడం దాదాపు ఖాయమైందా..? అంటే విశ్వసనీయ వర్గాలు ఔననే అంటున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి త్వరలో ఖాళీ కానున్న రెండు స్థానాల్లో ఒకటి ఆమెకు కేటాయిస్తారనే ప్రచారం పార్టీ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది. రెండో సీటు ఎవరికి దక్కుతుందనే విషయంలో మాత్రం ఉత్కంఠ నెలకొందని అంటున్నారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణకు 7, ఆంధ్రప్రదేశ్‌కు 11 రాజ్యసభ స్థానాలు కేటాయించారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి ఐదు రాజ్యసభ స్థానాలకు టీఆర్‌ఎ్‌సకి చెందిన జోగినపల్లి సంతో్‌షకుమార్‌, బండా ప్రకాశ్‌, బడుగుల లింగయ్య యాదవ్‌, కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్‌ ప్రాతినిధ్యం వహిస్తుండగా, మరో రెండు స్థానాలకు బీజేపీకి చెందిన గరికపాటి మోహన్‌రావు (గతంలో టీడీపీ), కాంగ్రెస్‌ నేత కేవీపీ రామచందర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Share This Post
0 0

Leave a Reply