రాజకీయాల్లో చంద్రబాబుది ఐరన్ లెగ్..: రోజా

చంద్రబాబుతో జాతీయ స్థాయిలో పొత్తు పెట్టుకున్నవారు ఎవరూ బాగుపడిన చరిత్ర లేదని రోజా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బాబుతో పొత్తు పెట్టుకున్న ఐకే గుజ్రాల్ ఆ తర్వాత రాజకీయాల్లోంచి తప్పుకోవాల్సి వచ్చిందన్నారు. అనంతరం ప్రధానులుగా వచ్చిన దేవెగౌడ, అటల్ బిహారీ వాజ్ పేయిలకు అదే గతి పట్టించారని విమర్శించారు. అలాంటి చంద్రబాబు చిన్నవయసులో ఉన్న రాహుల్ గాంధీతో ఇప్పడు పొత్తు పెట్టుకున్నారని వెల్లడించారు. రాహుల్ పరిస్థితిపై తనకు జాలివేస్తోందన్నారు. చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో ఐరన్ లెగ్ అనీ, ఆయనతో పెట్టుకున్నవాళ్లు ఎవ్వరూ బాగుపడలేదని రోజా విమర్శించారు. జగన్ పై దాడి వ్యవహారంలో ఏపీ ప్రభుత్వ పరిధిలో లేని స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.

Tags: ycp mla roja, satires on cbn, ik gujral, ys jagan

Share This Post
0 0

Leave a Reply