రతన్ టాటా కలల కారుకు పూర్తిగా గుడ్ బై!

మధ్య తరగతి ప్రజల కలల కారుగా వచ్చిన టాటా నానో, పూర్తిగా కాలగర్భంలో కలసిపోయింది. నానో కారు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయిందని, 2019లో ఒక్క కారును కూడా తయారు చేయలేదని సంస్థ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు స్టాక్ ఎక్స్ఛేంజీలకు టాటా మోటార్స్ సమాచారాన్ని అందించింది.

2018లో తయారు చేసిన ఒకే ఒక్క నానో కారును ఫిబ్రవరి 2019లో విక్రయించామని తెలిపింది. ప్రజల్లో ఆసక్తి ఉంటే కారును తయారీ చేయడం తిరిగి ప్రారంభిస్తామని చెప్పింది. కాగా, ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ఇండియా మొత్తం బీఎస్-6 ఉద్గార నిబంధనలు అమలులోకి రానున్న కారణంగా చౌక కార్లను తయారు చేయడం అసాధ్యమేనని వాహన పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Share This Post
0 0

Leave a Reply