యూఏఈ చరిత్రలోనే తొలిసారిగా..

యూఏఈ చరిత్రలోనే తొలిసారిగా ఓ హిందూ, ముస్లిం దంపతుల కు పుట్టిన బిడ్డకు జనన ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసింది. యూఏఈ చట్టాల ప్రకారం అక్కడ నివసించే విదేశీయుల్లో ముస్లిం మతస్తుడు ముస్లిమేతర మహిళను పెండ్లి చేసుకోవచ్చు. కానీ.. ముస్లిం మహిళ ముస్లిమేతరుడిని పెండ్లి చేసుకోరాదు. భారత్‌కు చెందిన కిరణ్ బాబు, సనమ్ సాబూ సిద్దిఖీ దంపతు లు 2016లో కేరళలో పెండ్లి చేసుకున్నారు. కొన్నాళ్లుగా షార్జాలో నివసిస్తున్నారు. 2018 జూలైలో వారికి అక్కడే కూతురు జన్మించింది. అనామ్తా ఏస్‌లిన్ కిరణ్ అని పేరుపెట్టారు. అయితే నిబంధనల మేరకు వారికి బర్త్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు అధికారుల నిరాకరించారు. కోర్టును ఆశ్రయించినా ఫలితం లేదు. వారు భారత్‌కు వచ్చేందుకు ప్రయత్నించగా బర్త్ సర్టిఫికెట్ లేకపోవడంతో పాపకు ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ రాలేదు. దీంతో కిరణ్ మరోసారి కోర్టుకు వెళ్లగా.. ఆయన అభ్యర్థనను మన్నించింది. బర్త్ సర్టిఫికెట్ జారీకి అనుమతిచ్చింది.

Share This Post
0 0

Leave a Reply