యాదాద్రీషునికి ఘనంగా లక్ష పుష్పార్చన

ఏకాదశి సందర్భంగా యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ఘనంగా లక్ష పుష్పార్చనతో పూజలు చేశారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన పుష్పార్చనలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వచ్చే ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారిని లక్ష పుష్పాలతో అర్చించడం ఆలయ సాంప్రదాయం. దసరా సెలవులు ఉండటంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.

Share This Post
0 0

Leave a Reply