యాదాద్రికి పుత్తడి సొబగులు

యాదాద్రి పంచనారసింహక్షేత్రం మహాద్భుత రూపంలో పునరావిష్కృతంకావడానికి సంసిద్ధమవుతున్నది. లక్ష్మీనారసింహుడి ప్రధానాలయ ముఖమండపంలో కీలక పనులు ముగింపుదశకు చేరుకున్నాయి. గర్భాలయ ప్రధాన ద్వారం, ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం, బలిపీఠంతోపాటు ఇప్పటికే పూర్తయిన సప్తగోపురాలపై ఏర్పాటుచేసిన 58 కలశాలకు పసిడి సొబగులను తీర్చిదిద్దే పనులు ప్రారంభమయ్యాయి. ముందుగా వీటిపై రాగి పలకలను అమర్చే పనులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అనంతరం వీటికి బంగారు తాపడంచేస్తారు. గర్భగుడికి ఏర్పాటుచేసిన ప్రధాన ద్వారానికి కూడా రాగిపలకలపై బంగారు తాపడంచేసే పనులు చెన్నైలో జరుగుతున్నాయి. యాదాద్రి ఆనువంశిక ధర్మకర్త బీ నరసింహమూర్తి, ఈవో ఎన్‌ గీత, స్థపతి ఆనందాచార్యుల వేలు, ఆలయ డీఈ మహిపాల్‌రెడ్డితోపాటు చెన్నైలో ఆభరణాల తయారీ అధికారులు సభ్యులుగా ఏర్పడిన కమిటీ ఈ పనులను పర్యవేక్షిస్తున్నది. నెలరోజుల్లో ఆలయ నిర్మాణ పనులను పూర్తిచేస్తామని స్థపతి ఆనందాచార్యుల వేలు తెలిపారు.

Share This Post
0 0

Leave a Reply