మ‌హిళ‌ల‌పై ప్ర‌భుత్వం దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తుంది..చంద్ర‌బాబుపై మ‌హిళా సంఘాలు ఫిర్యాదు..

ఉపాధి తొల‌గించ‌వ‌ద్దు అంటూ రంగంలో దిగిన మధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం నిర్వాహ‌క మ‌హిళ‌ల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తుంది. ఈ క్ర‌మంలో మ‌హిళ‌ల‌ని చూడ‌కుండా
పిడిగుద్దులు గుద్దుతూ వారిని దౌర్జ‌న్యంగా ఈడ్చుకెళ్లి పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా విశాఖ‌ జిల్లా చోడ‌వ‌రంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఏళ్ల త‌ర‌బ‌డి ప‌నిచేస్తున్న
క‌మిటీల‌ను కాద‌ని అధికార టీడీపీ ప్ర‌భుత్వం ఈ నెల‌ 24 నుంచి పాఠ‌శాల‌ల్లో న‌వ‌ప్ర‌యాస్ అనే ప్రైవేట్ సంస్థ‌కు ఈ ప‌థ‌కాన్ని అప్ప‌గించింది.

దీన్ని తీవ్రంగా వ్య‌తిరేకించిన మ‌ధ్యాహ్న ప‌థ‌కం నిర్వాహ‌కులు చోడ‌వ‌రం స‌మీపంలో ఉన్న న‌వ‌ప్ర‌యాస్ సంస్థ పాఠ‌శాల గేటు ముందు పెద్దఎత్తున ఆందోళ‌న‌లు చేప‌ట్టారు. ఇక వారి
నిర‌స‌న‌ల‌ను ఖండిస్తూ పోలీస్ అధికారులు పెద్ద సంఖ్య‌లో చేరుకుని దౌర్జ‌న్యంగా వ్య‌వ‌హ‌రించి మ‌హిళ‌ల‌పై విచ‌క్ష‌ణార‌హితంగా ప్ర‌వ‌ర్తించి వారిని అక్ర‌మంగా అరెస్టులు చేస్తున్నారు. ఈ
క్ర‌మంలో కొంత మంది మ‌హిళ‌లు స్రృహ త‌ప్పి ప‌డిపోగా మ‌రికొంత మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.

ఇక అరెస్ట్ అయిన త‌ర్వాత మ‌హిళ‌లు మాట్లాడుతూ, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్రైవేట్ సంస్థ‌ల ద‌గ్గ‌ర అధిక సంఖ్య‌లో ముడుపులు తీసుకుని త‌మ జీవ‌నోపాధిని దెబ్బ
తీసేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వారు మండిప‌డుతున్నారు. తాము ఈ విష‌యాన్ని మాన‌వ హ‌క్కుల క‌మీష‌న్ కు ఫిర్యాదు చేయ‌నున్నామ‌ని వారు స్ప‌ష్టం చేశారు.

Share This Post
0 0

Leave a Reply