మోహినీ రూపంలో దర్శనమిస్తున్న శ్రీనివాసుడు

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. ఐదో రోజున మోహినీ అవతారంలో శ్రీనివాసుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఆ పక్కనే దంతపు వాహనంపై వెన్నముద్ద కృష్ణుడిగానూ భక్తులకు కనువిందు చేస్తున్నాడు. ముగ్ధమనోహర మోహిని, ఆ వెన్నంటే వెన్నదొంగ కృష్ణుడు తిరుమాడ వీధుల్లో విహరిస్తున్నారు. కమనీయమైన శ్రీహరి రూపం జగత్‌ సమ్మోహనం. మోహినీ రూపం వర్ణనాతీతం, క్షీరసాగర మథనంలో మోహినీగా ఉద్భవించిన స్వామి.. అసురుల్ని మాయ చేసి సురులకు అమృతాన్ని అందించారని పురాణగాథ. జగత్తు అంతా మాయా మోహానికి లొంగి ఉంది. మాయా జగన్నాటక సూత్రధారి దేవదేవుడు. ప్రపంచమంతా మాయావిలాసమని, తన భక్తులు కానివారు మాయాధీనులు కాక తప్పదని గీతలో స్వామి చెప్పారు. అందుకే మాయామయమైన జగత్తు నుంచి భక్తుల్ని బయటపడేసేందుకు మోహినీ రూపంలో వాహన రూఢుడై తిరుమాడ వీధుల్లోకి శ్రీనివాసుడు వచ్చినట్లు భక్తుల విశ్వాసం.

Share This Post
0 0

Leave a Reply