మోహన్‌బాబుకు ఏడాది జైలుశిక్ష

సినీ నటుడు, వైకాపా నేత మోహన్‌బాబుకు హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌ కోర్టు ఏడాది జైలుశిక్ష విధించింది. రూ.40లక్షల చెక్‌బౌన్స్‌కు సంబంధించి 2010లో సినీ దర్శకుడు వైవీఎస్‌ చౌదరి కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మంగళవారం కేసు విచారణ జరగ్గా, మోహన్‌బాబుకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఇందులో ఎ1గా ఉన్న లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌కు రూ.10వేల జరిమానా, ఏ2గా ఉన్న మోహన్‌బాబుకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.41,75,000 చెల్లించాలని ఆదేశించింది.

Share This Post
0 0

Leave a Reply