మొక్కలునాటిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌

ఎంపీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ఇండియా చాలెంజ్‌లో భాగంగా అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ బర్కత్‌పురలోని జీహెచ్‌ఎంసీపార్కులో ఆదివారం మొక్కలు నాటా రు. రోజురోజుకు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలంతా విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చా రు. స్థానిక అరుణ ఫొటో స్టూడియోకు వచ్చే కస్టమర్లకు ఉచితంగా పారిజాతం మొక్కలు పంపిణీచేయడంపై స్టూడియో ఎండీ నిమ్మల సతీశ్‌ను అభినందించారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ అధికారి కృష్ణ, పార్కు అసోసియేషన్‌ అధ్యక్షుడు శేషునారాయణ, శ్యాం, వివేక్‌, లక్ష్మణరావు, రాజశేఖర్‌రెడ్డి, డాక్టర్‌ ధనుంజయరెడ్డి, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

Share This Post
0 0

Leave a Reply