మేడారానికి ఆర్టీసీ చార్జీలు పెంపు

ఈసారి మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ప్రయాణభారం తప్పేలా లేదు. వేర్వేరు ప్రాంతాల నుంచి మేడారానికి భక్తులను చేరవేసే ప్రత్యేక బస్సుల్లో చార్జీలను ఆర్టీసీ ఉన్నతాధికారులు పెంచేశారు. ఈ ధరల పెంపు కనిష్ఠంగా రూ. 10.. గరిష్ఠంగా రూ. 80గా ఉంది. 4 వేలకు పైగా ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైన ఆర్టీసీ.. మొత్తం 23 లక్షల మంది ప్రయాణికులను చేరవేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా రూ. 30 కోట్ల మేర ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ సారి హైదరాబాద్‌ నుంచి ఏసీ బస్సుల (గరుడ, రాజధాని) సంఖ్యను పెంచినట్లు ఆర్టీసీ వరంగల్‌ రీజనల్‌ మేనేజర్‌ అంచూరి శ్రీధర్‌ వెల్లడించారు. హైదరాబాద్‌ నుంచి మేడారానికి వచ్చే గరుడ బస్సుల్లో చార్జీలను పెద్దలకు రూ. 860, పిల్లలకు రూ. 660గా.. రాజధాని బస్సుల్లో పెద్దలకు రూ. 710, పిల్లలకు రూ. 540గా నిర్ణయించామని ఆయన వివరించారు. పెరిగిన చార్జీలతో కూడిన చార్ట్‌ను ఆయన గురువారం విడుదల చేశారు.

Share This Post
0 0

Leave a Reply