మేం ప్రజలకు జవాబుదారులం..విజయసాయిరెడ్డి

అమరావతి: బీజేపీ నేత సుజనా చౌదరి, మాజీ మంత్రి దేవినేని ఉమలను ఉద్దేశించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కార్యదర్శులను పక్కకు నెట్టి… కొత్తగా పార్టీలో చేరిన బాబు కోవర్టులు బీజేపీని కంట్రోల్‌‌లోకి తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మొన్న గవర్నర్‌ను కలిసిన సుజనాచౌదరి బృందాన్ని చూస్తే ఈ విషయం అర్థమవుతుందని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. మోదీ, అమిత్‌షా కంటే ఈ బానిసలకు చంద్రబాబే ముఖ్యమన్నారు.

అనంతరం మరో ట్వీట్‌లో దేవినేని ఉమపై విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. ‘‘కొద్ది రోజులు ఓపిక పట్టు ఉమా! రివర్స్ టెండర్లు, జ్యుడిషల్ కమిషన్ వల్ల ఫలితాలెలా ఉంటాయో తెలుస్తుంది. మీ వేల కోట్ల దోపిడీ కూడా బయట పడుతుంది. నాలుగేళ్లలో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని జగన్‌ మాటిచ్చారు.మేం ప్రజలకు జవాబుదారులం, పచ్చ దొంగలకు కాదు’’ అని విజయసాయిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు

Share This Post
0 0

Leave a Reply